Andhra Pradesh
పెన్సిల్ చెక్కే బ్లేడ్‌తో తోటి విద్యార్ధిని చంపేశాడు

Kalinga Times,New Delhi :కృష్ణా జిల్లా అవనిగడ్డ లో మంగళవారం మూడో తరగతి బాలుడు దాసరి ఆదిత్య హత్యకు గురైన సంగతి తెలిసిందే. కాగా.. బాలుడి హత్య కేసు మిస్టరీని పోలీసులు చేధించారు. పదో తరగతి విద్యార్థే… ఈ ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసులు గురర్తించారు. నిండా పదిహేనేళ్లు కూడా లేని విద్యార్ధి ఇంత కర్కశంగా తోటి విద్యార్ధిని ఎలా చంపారనేది ఇప్పుడు అందరినీ విస్మ యానికి గురి చేస్తోంది.బాలుడి హత్యకు ఉపయోగించిన పెన్సిల్ చెక్కే బ్లేడ్‌తో పాటు రక్తపు మరకలు ఉన్న దుస్తులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆదిత్య తన మాట వినడం లేదనే కోపంతో నిందితుడు ఈ హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు.ఇక నిందితుడితో పాటు హాస్టల్ వార్డెన్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సంఘటనకు సంబంధించి ఇన్చార్జి వసతి గృహ అధికారి పీవీ నాగరాజు, వాచ్‌మన్ నాగబాబుని జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ సస్పెండ్ చేశారు.
One Comment