social

సూర్యుని వెలుతురును మేఘం కొంత సేపే అడ్డుకోగలదు

Kalinga Times ,Hyderabad : బ్రహ్మముహూర్తంలో లేచి, చన్నీటితో స్నానం చేసి, పూజచేసి, బయటకట్టమీద కూర్చొని ప్రతివానిని- ఇంట్లోని వారిని, బయటివారిని దూషిస్తుంటారు కొందరు. అలాంటివారు జాగ్రత్తపడి ఆ దురలవాటును మానుకోకపోతే వారిది వృధా ప్రయాసగా మిగిలిపోతుంది తప్ప ఏ పుణ్యమూ రాదు, పాపం రావచ్చు కూడా. ఇక చాలామంది ఎవరో ఏమో అన్నారని తెగ బాధపడిపోతుంటారు. సహనాన్ని కోల్పోతారు, ఎదురుదాడిచేసి ప్రతీకారము చేయదలుస్తారు. దాని నుంచి మనసుకు అశాంతి కలుగుతుంది. తప్ప ఏమీ ఒరగదు. ఎవడైనా ఏమైనా అంటే అది నిజంగానీ, అబద్ధంగానీ బాధపడవలసిందీ, కోపగించుకోవలసిందీ కానే కాదు. అది నిజమైతే నిజం కాబట్టి కోప్పడరాదు. అబద్ధమైతే అది ఎలాగూ త్వరలోనే సమసిపోతాది. సూర్యుని వెలుతురును మేఘం కొంత సేపే అడ్డుకోగలదు. ఆ తర్వాత సూర్యుడు ఇంకా కాంతి వంతంగా ప్రకాశిస్తాడు. అట్లే అబద్ధం కూడా తేలిపోతుంది. నిజం నిప్పులా ప్రకాశిస్తుంది.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published.

Close