Film

దిల్‌’ రాజు వివాహం

Kalinga Times, Hyderabad :  ప్ర‌ముఖ నిర్మాత దిల్ రాజు ఆదివారం నిజామాబాద్‌లోని ఫార్మ్‌ హౌస్‌లో రాత్రి 11.30 గంటలకు అతి కొద్దిమంది సన్నిహితుల మధ్య త‌న స్నేహితురాలిని వివాహం చేసుకున్నారు..అమెరికాలో ఎన్ ఆర్ ఐ  కుటుంబానికి చెందిన వ‌ధువు ఎయిర్ హోస్టేస్ గా ప‌ని చేస్తున్న‌ది.. దిల్‌’ రాజు వివాహం చేసుకున్నది వాళ్ల బంధువుల అమ్మాయినే.. మూడేళ్ల క్రితం దిల్ రాజు భార్య అనిత గుండెపోటుతో మరణించడంతో కొద్ది రోజులుగా ఒంట‌రిగా ఉంటున్నారు. జీవితంలో త‌న‌కు ఓ తోడు కావాల‌ని భావించిన ఆయ‌న రెండో పెళ్ళి చేసుకున్నారు. దిల్ రాజు కుమార్తె హ‌న్సిత సైతం తండ్రిని రెండో వివాహం చేసుకోవ‌ల‌సిందిగా కోర‌డమే కాకుండా ఈ వివాహ వేడుక‌ను ద‌గ్గ‌రుండి జ‌రిపింది.. ఈ వివాహం సంద‌ర్భంగా హ‌న్సిత తండ్రికి శుభాకాంక్ష‌లు తెలుపుతూ ఒక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది.. “డియ‌ర్ డాడ్.. నువ్వు నాకు అన్ని విష‌యాల్లో అండ‌గా నిలిచావు. మీ వ‌ల‌న అంద‌రం సంతోషంగా ఉన్నాం. మ‌న కుటుంబ సంతోషం కోసం మీరు ఎన్నో చేశారు. కొత్త జీవితం ప్రారంభించ‌బోతున్న మీకు శుభాకాంక్ష‌లు. మీరిద్ద‌రు సంతోషంగా ఉండాల‌ని ప్ర‌తి రోజు అద్భుతంగా ఉండాల‌ని మ‌నస్పూర్తిగా కోరుకుంటున్నా” అని హ‌న్సిత ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు.

Tags
Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published.

Close