Film

ప‌వ‌ర్ స్టార్ మూవీ ట్రైల‌ర్ ఈనెల 25న …ట్రైలర్ చూడాలంటే 25రూపాయలు

Kalinga Times,Hyderabad : శివ మూవీతో తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌కు కొత్త దారి చూపిన రామ్ గోపాల్ వ‌ర్మ‌.ఇప్ప‌టికీ కొత్త కొత్త మార్గాల అన్వేష‌ణ‌లో దూసుకుపోతున్నాడు కరోనా లాక్ డౌన్ పిరియ‌డ్ లోనూ క్లైమాక్స్, న‌గ్నం వంటి మూవీల‌ను చ‌క చ‌కా తీసేసి వాటికి టిక్కెట్ మ‌రీ ఒటిటి లో వ‌దిలేశాడు.ఆ రెండు మూవీలు వ‌ర్మ‌కు క‌న‌క వ‌ర్షం కురిపించాయి. కాగా ఈసారి వ‌ర్మ మ‌రో అడుగు ముందుకు వేశాడు.ప్ర‌పంచ సినీ చ‌రిత్ర‌లో ట్రైల‌ర్ ను ఇప్ప‌టి వ‌ర‌కు ఉచితంగానే ఆయా నిర్మాత‌లు చూపారు. అయితే ఇప్పుడు వ‌ర్మ ఆ విధానాన్ని బ్రేక్ చేశాడు. తాజాగా తన లేటెస్ట్ మూవీ ప‌వ‌ర్ స్టార్ మూవీ ట్రైల‌ర్ ను ఈనెల 25న త‌న ఒటిటి ద్వారా విడుద‌ల చేయ‌నున్నాడు. అయితే ఈ మూవీ ట్రైలర్ చూడాలంటే 25రూపాయలు చెల్లించాల్సిందేనన్నాడు. అలాగే సినిమాకు అయితే ఏకంగా 150 రూపాయలు ఫిక్స్ చేశాడు. అది కూడా ఈ నెల 25వ తేదీ వరకు అడ్వాన్స్ బుకింగ్ చేసుకుంటేనే. టైమ్ దాటితే.. 250 రూపాయలు చెల్లించాల్సిందేనని ఖరాఖండీగా చెప్పాశాడు. అందుకే రిలీజ్ వరకు ఆగకుండా ముందే బుక్ చేసుకుని 100 ఆదా చేసుకోండి అంటూ ఆఫర్ కూడా ఇచ్చాడు.

Tags
Show More

Related Articles

Close