Telangana
జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో వారం రోజుల పాటు ప్రత్యేక శానిటేషన్ డ్రైవ్
శేరిలింగంపల్లి డివిజన్ కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్
Kalinga Times,Hyderabad : ప్రతి ఒక్కరూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, ప్రతి కాలనీల్లో పేరుకుపోయిన చెత్తాచెదారాన్ని తొలగించనున్నట్లు శేరిలింగంపల్లి డివిజన్ కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ అన్నారు. ఇటీవల కురిసిన వర్షాల వల్ల వరద నీటి ప్రవాహంతో ఇళ్ల మధ్యలోకి, రోడ్లపైకి వచ్చిన చెత్తాచెదారాన్ని, మట్టిని తొలగించి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచేలా జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో వారం రోజుల పాటు ఏర్పాటు చేసిన ప్రత్యేక శానిటేషన్ డ్రైవ్ ను శుక్రవారం రాజీవ్ గృహకల్పలో కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ జెండా ఊపి ప్రారంభించారు. వారం రోజుల పాటు నిర్వహించే స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ ద్వారా ప్రతీ కాలనీ, ప్రతి గల్లీ శుభ్రం చేయడం జరుగుతుందన్నారు. ప్రతి ఒక్కరూ తమతమ పరిసరాలను శుభ్రంగా ఉంచుకుని ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వార్డు మెంబర్ శ్రీకళ, జవాన్ ఈశ్వర్, నాయకులు చంద్రకళ, సౌజన్య, నజియా, కుమారి, వెంకటేశ్వరరావు, సత్తార్, పవన్, ఎస్ ఎఫ్ ఏ లు, శానిటేషన్ సిబ్బంది ఉన్నారు.
I find myself in the bathroom alot propecia fast delivery Lonnie tGoXYwKlSM 6 27 2022