National
భారత్ 43.3 ఓవర్లలో 3 వికెట్లకు 265 పరుగుతో విజయం

Kalinga Times ,Hyderabad : ప్రపంచకప్ లీగ్ దశను టీమిండియా శతకాల మోతతో ముగించింది. ఓపెనర్లు రాహుల్ (118 బంతుల్లో 11 ఫోర్లు, 1 సిక్స్‌తో 111), రోహిత్ (94 బంతుల్లో 14 ఫోర్లు, 2 సిక్సర్లతో 103) లంక బౌలర్లపై ఆధిపత్యం చూపుతూ సెంచరీలు సాధించగా భారత్ 7 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. శనివారం జరిగిన మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక 50 ఓవర్లలో 7 వికెట్లకు 264 పరుగులు చేసింది. ఏంజెలో మాథ్యూస్ (128 బంతుల్లో 10 ఫోర్లు, 2 సిక్సర్లతో 113) శతకం సాధించగా తిరిమన్నె (68 బంతుల్లో 4 ఫోర్లతో 53) అర్ధసెంచరీ సాధించాడు. బుమ్రాకు మూడు వికెట్లు దక్కాయి. ఆతర్వాత ఛేదనలో భారత్ 43.3 ఓవర్లలో 3 వికెట్లకు 265 పరుగులు చేసి నెగ్గింది. లండన్ లోని లీడ్స్ హెడెంగ్లీలో భారత్ వర్సెస్ శ్రీలంక జట్ల మధ్య జరుగుతున్న ఐసీసీ వరల్డ్ కప్ క్రికెట్ మ్యాచ్ లో భారత్ గెలుపులో 103 పరుగులతో కీలకంగా నిలిచిన రోహిత్ శర్మకు మ్యాన్ అఫ్ ది మ్యాచ్ దక్కింది.