Telangana

కాళేశ్వర ప్రాజెక్ట్ ను ఏరియల్ వ్యూ ద్వారా పరిశీలించిన కేసీఆర్

Kalinga Times,Hyderabad: మంగళవారం  సీఎం.. కేసీఆర్ ఏరియల్ వ్యూ ద్వారా కాళేశ్వరం జలశయాన్ని పరిశీలించారు. గోదావరి వరద ఉధృతిపై, తాజా పరిస్థితికి సంబంధించి అధికారులను అడిగి సమాచారం తెలుసుకున్నారు.. వ్యూ పాయింట్‌, వంతెనపై నుంచి విడుదలవుతున్న నీటి ప్రవాహాన్ని కేసీఆర్ పరిశీలించారు. అనంతరం గోదావరి మాతకు పూలు, పట్టు వస్త్రాలు సమర్పించి పూజలు చేశారు.



తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ గోలివాడ పంపుహౌజ్ వద్దకు చేరుకున్నారు. సీఎం కేసీఆర్‌తో పాటు అధికారులు, ఇంజినీర్లు కాళేశ్వరం బయల్దేరారు. ముందుగా మేడిగడ్డ బ్యారేజీను సీఎం సందర్శిచారు. గోదావరి నదికి సీఎం పూజలు చేశారు. అక్కడ్నుంచి గోలివాడ పంపుహౌస్‌కు చేరుకుని పంపుహౌజ్‌ను కేసీఆర్ పరిశీలిస్తున్నారు. గోలివాడ పంపుహౌజ్ పరిశీలన అనంతరం ఎల్లంపల్లి ప్రాజెక్టుని సందర్శించనున్నారు.

ఎల్లంపల్లి ప్రాజెక్టును సందర్శించి.. అధికారులతో మాట్లాడతారు. అక్కడి నుంచి వెళ్లి ధర్మపురి లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకుంటారు. అనంతరం సాయంత్రం తిరిగి హైదరాబాద్‌కు బయల్దేరతారు. కేసీఆర్ వెంట మంత్రి ఈటెల, ఎంపీ సంతోష్ కుమార్, ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ఉన్నారు.

Show More

Related Articles

Leave a Reply to hKFcHfEaPV Cancel reply

Your email address will not be published.

Close