Telangana

12 వ డివిజన్ ను వారం రోజులు *స్వచ్ఛంద లాక్ డౌన్*

ప్రకటించిన కార్పోరేటర్ *బోడ్డు రజిత రవిందర్

 కళింగ టైమ్స్: గోదావరిఖని,
రామగుండం కార్పోరేషన్ పరిధి లోని 12 వ డివిజన్ లో డివిజన్  కార్పొరేటర్ డివిజన్ ప్రజల తోటి అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి కరోన కేసులు ఎక్కువ అవుతున్నందున లాక్ డౌన్ పెట్టుకుందామని డివిజన్ లోని ప్రజలతో చర్చించడం జరిగిందని డివిజన్ ప్రజలందరూ ఏక గ్రీవంగా ఆమోదం తెలపడంతో డివిజన్ కార్పొరేటర్  రేపటి నుండి వారం రోజుల పాటు  సంపూర్ణ లాక్ డౌన్ ప్రకటించి డివిజన్ ప్రజలతో ప్రతిజ్ఞ చేయించడం జరిగింది , ఈ సందర్భంలో కార్పొరేటర్ బొడ్డు రజిత రవిందర్ మాట్లాడుతూ, కరోన మహమ్మారి విజృంభిస్తున్న తరుణంలో 12వ డివిజన్ ప్రజల ప్రాణాలు కాపాడుకోవడానికి  సామాజిక దూరం వల్లనే సాధ్యం కాబట్టి , సంవత్సరం లో 12 వ డివిజన్ ను అప్పటి పరిస్థితులను బట్టి  మీ అందరి సంపూర్ణ సహకారం తో  స్వచ్ఛంద లాక్ డౌన్  పెట్టుకొని మన డివిజన్ లోని ప్రజలందరినీ కాపాడుకోవడం జరిగిందని, రేపటి నుండి వారం రోజులపాటు సంపూర్ణ *లాక్ డౌన్* ప్రకటించడం జరిగింది, ప్రజల సౌకర్యార్థం  నిత్యావసర సరుకులకు మరియు చిరు వ్యాపారస్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉదయం 6 గంటలనుండి మధ్యాహ్నం 1 గంట వరకు  షాపులకు అనుమతి ఇవ్వడం జరిగింది ఆ తరువాత షాపులన్ని  కచ్చితంగా మూసి వేయాలని  నిర్ణయించడం  జరిగింది , ఈ తీర్మానాన్ని ప్రతి ఒక్కరు పాటించాలని ఇల్లు ఇల్లు తిరుగుతూ డప్పుతో చాటింపు వేయడం జరిగిందని , ప్రజల్లో కరోనా కోసం అవగాహన కల్పిస్తూ అందరు మాస్కూలు దరించాలని ఏదైనా లక్షణాలు  అనిపించినా టెస్ట్ లు చేయించుకో వాలని ఒకవేళ కరోనా పాజిటివ్ వచ్చినా కూడా ఎవరు ఆందోళన చెందకుండా ధైర్యంగా వైద్యం చేయించుకోవాలని, ప్రభుత్వ ఆసుపత్రిలో రామగుండం శాసన సభ్యులు కోరుకంటి చందర్ మేయర్ అనిల్ కుమార్, అన్ని ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారని ఎక్కువ మొత్తమ్ లో  ఆక్సిజన్ పడకలు అందుబాటులో ఉంచడం జరిగిందని  ఇంకా అవసరమయితే ఎక్కువ పడకలు సిద్ధం చేయిస్తున్నారని, కుటుంబ సభ్యులు పట్టించుకోని వారికి మేము అండగా ఉంటామని తెలియజేసారు ,  , కరోనా వచ్చిన వారికి  మేము వారియర్ గా ముందుండి మీకు అండగా మేము, విజయమ్మ ఫౌండేషన్ సభ్యులు ముందుంటారని తెలియజేస్తూ అందరూ వాక్సిన్ వేయించుకోవాలి అని కోరుతూ వాక్సిన్ పైన ఎలాంటి అపోహలకు లోను కావొద్దని డివిజన్ ప్రజల రక్షణకై మనం పెట్టుకున్న స్వచ్ఛంద లాక్ డౌన్ ను సంపూర్ణంగా విజయవంతం చేయాలని ప్రజలందరినీ చేతులు జోడించి కోరడం జరిగింది ,ఈ కార్యక్రమంలో పసుల బాపు , సురేష్ భవాని , పోషమ్ భవాని , నంద సాంబ కొమురయ్య , తోట రమేష్ , md సర్వర్ , సందవేన కుమార్ , గుడెపు రమేష్ , గడ్డం రాజేంద్ర ప్రసాద్, అనవేన మహేందర్, కుంచం శ్రీకాంత్ , మొయినోద్దీన్, రొడ్డ దీక్షిత్, గుండెబోయిన శ్రీనివాస్, మద్దెల లక్ష్మణ్,   కోడూరీ ఆంజనేయులు , మామిడి పెళ్లి సురేష్,నంద శివ, మహేందర్, అనవేన సంధ్య , కట్ట ప్రమీల,  లలిత తదితరులు పాల్గొన్నారు

Show More

Related Articles

One Comment

Leave a Reply to mindvault Cancel reply

Your email address will not be published.

Close