BC NewsTelangana

బి ఆర్ ఎస్ ప్రభుత్వ పాలనలో సామాన్యుడు బ్రతికే పరిస్థితి లేదు

కుబీర్: కెసిఆర్ పాలనలో సామాన్యులు బతికే పరిస్థితి లేదని ముధోల్ నియోజకవర్గ బిజెపి పార్టి ఇంచార్జ్ మోహన్ రావు పాటిల్ అన్నారు. కుబీర్  మండలంలోని చోండి గ్రామంలో కళాకారుల ఆట పాటలతో ఉత్సాహంగ పల్లె పల్లెకు బిజెపి గడప గడపకు మోహన్ రావు కార్యక్రమాన్ని ఆదివారం నిర్వహించారు. ఈ  కార్యక్రమంలో ముఖ్య అతిధిగా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ముధోల్ నియోజకవర్గ బిజెపి పార్టీ ఇంచార్జి మోహన్ రావు పాటిల్ పాల్గొన్నారు. చోండి  గ్రామం లో  బిజెపి జెండాను ఆవిష్కరించి,కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న అద్భుత పథకాలను క్యాలెండరు రూపంలో  ఇంటి ఇంటికి వెళ్లి అందజేశారు… అనంతరం గ్రామంలో ఏర్పాటు చేసిన రచ్చబండ కార్యక్రమంలో మోహన్ రావు గారు మాట్లాడుతూ బి ఆర్ ఎస్, కాంగ్రెస్ పార్టీ లు రెండు దొందు దొందే అని ఎద్దేవ చేసారు.

ప్రజల కోసం పనిచేయాల్సిన ముఖ్యమంత్రి కేవలం కల్వకుంట్ల కుటుంబం కోసమే పని చేస్తున్నారు… వేల ఎకరాలు ధరణి పేరుతో దిగ మింగుతున్నారని విమర్శించారు. నిత్యం ఫామ్ హౌస్ లో ఉండే కెసిఆర్ ఎన్నికల సమయంలో  ప్రజలను మోసం చేయడానికి  కొత్త కొత్త అబద్దాలకు తెర తీస్తున్నరన్నారు. కెసిఆర్ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి సామాన్యూడు బ్రతికే పరిస్థితి లేదన్నారు.

పార్టీ కార్యకర్తలు అంకితభావంతో భాగస్వామ్యం కావాలని, అందరు కలిసికట్టుగా ఉండి బిజెపి పార్టీని అధికారంలోకి తీసుకురావాలని పేర్కొన్నారు….. ఈ కార్యక్రమంలో వారి వెంట అసెంబ్లీ కన్వీనర్, జిల్లా నాయకులు, మండల స్థాయి నాయకులు, గ్రామ నాయకులు, యువకులు తదితరులు పాల్గొన్నారు.

 

Show More

Related Articles

32 Comments

Leave a Reply to Caiden4110 Cancel reply

Your email address will not be published.

Close